రవి చేసిన రొయ్యల ఇగురు.. నోరూరిస్తోంది!
on May 17, 2021
బుల్లితెరపై యాంకర్ రవి ఎంత యాక్టివ్ గా ఉంటాడో అందరికీ తెలిసిందే. కో యాంకర్ గా ఎవరు వచ్చినా కూడా రవిలో ఎనర్జీ ఎంతమాత్రం తగ్గదు. లాస్య, శ్రీముఖి, భానుశ్రీ ఇలా ఎంతమంది పక్కన యాంకర్ గా చేసినప్పటికీ తనదైన ముద్ర వేయగలిగాడు. రవి తన ఫ్యామిలీని పరిచయం చేసినప్పటి నుండి ఆయన ఇమేజ్ మారిపోయింది. తన భార్య నిత్య, కూతురు వియాలతో సోషల్ మీడియాలో రవి చేసే అల్లరి మాములుగా ఉండదు. మరీ ముఖ్యంగా కూతురు వియాతో రవి షేర్ చేసే వీడియోలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి.
అయితే తన కూతురుకి ఇష్టమైన వంటకాలను వండిపెట్టడానికి రవి చేసే ప్రయత్నాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. గత రెండు రోజులుగా రవి ఇంట్లో చెఫ్ అవతారమెత్తారు. రంజాన్ స్పెషల్ గా బిరియానీ వండేశారు. దీనికి సంబందించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇందులో ఆ బిరియానీను వియా రుచి చూసి బాగుందని చెప్పడం.. దానికి రవి సంతోషపడడం కనిపిస్తుంది. ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలు కామెంట్స్ చేయడంతో వైరల్ అవుతోంది.
ఇక ఆదివారం నాడు రవి మరో స్పెషల్ డిష్ ను వండిపెట్టారు. ఆదివారం ఆడవాళ్లకు సెలవు అనే పద్దతిని రవి పాటిస్తున్నట్లు ఉన్నారు. ఈ మేరకు ఆదివారం రొయ్యల ఇగురుని ఎంతో ఇష్టంగా భార్య, పిల్లలకు వండిపెట్టారు. ఈ వీడియోను ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేస్తూ ''ఆదివారం ఆడవాళ్లకు సెలవు.. రొయ్యల ఇగురు రవి స్టైల్ లో.. అందరూ ఇంట్లోనే ఉంటూ క్షేమంగా ఉన్నారని ఆశిస్తున్నా'' అంటూ క్యాప్షన్ ఇచ్చారు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
